# చంద్రయ్యపల్లి, బాంజీపేట గ్రామాల్లో
పశువులకు గాలికుంటూ వ్యాధి టీకాల కార్యక్రమం.
నర్సంపేట,నేటిధాత్రి :
పశువులకు గాలికుంటూ వ్యాధి సోకకుండా ముందస్తుగా నివారణ టీకాలను వేయించాలని పశుసంవర్ధక శాఖ బానోజిపేట పశువైద్యాధికారి డాక్టర్ రావుల వింధ్య తెలిపారు. గురువారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి,బానోజీపేట గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని డాక్టర్ వింధ్య నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకడం వలన కాలి డెక్కలలో పుండ్లు అధికమైన అలాగే పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం కుంటుపడుతుందని డాక్టర్ వింధ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అన్వేష్,జయరాం, గోపాలమిత్రులు సురేందర్ మధుకర్ సంతోష్, పశుమిత్ర పుష్పలత అను రైతులు పాల్గొన్నారు.