చిట్యాల నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ చిట్యాల మండల మాజీ యూత్ అధ్యక్షులు జన్నె యుగేందర్, బీజేవైఎమ్ జిల్లా నాయకులు గొర్రె శశీ కుమార్ లను చిట్యాల మండల పోలీసులు మంగళవారం ఉదయం ఐదు గంటలకే పోలీసులు ముందస్తు అక్రమ అరెస్టు చేసి తమ కస్టడి లో ఉంచుకోవడం జరిగిందని వారు అన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షులు జన్నె యుగేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల కాలం లోనే యువజన, విద్యార్థి నాయకులకు భయపడి అరెస్టు చేయడం సిగ్గుచేటు అని ఇంతటి దుర్మార్గమైన చర్య ఎక్కడ కూడా లేదని రెండు నెలల కాలంలోనే ఉద్యమ నాయకులకు,విద్యార్థులకు భయపడితే రాబోయే ఐదేళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని అడుగుతా ఉన్నాం మేడి గడ్డ పరిశీలనకు వస్తున్న రేవంత్ రెడ్డి ఇలా ప్రతిపక్ష యువజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అతి త్వరలోనే మీ పాలన యువజన,విద్యార్థుల చేతుల్లోనే అంతమవుతుంది రాబోయే ఎంపీ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు, యువకులు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా అక్రమ అరెస్టులను నిలిపివేసి ప్రజా పాలన చేయాలని తెలియజేస్తున్నాం