లక్షెటిపేట (మంచిర్యాల) నేటిదాత్రి
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని ఉపాధ్యాయునిలు దీపాలను పువ్వులతో అందంగా అలంకరించి వెలిగించారు. అనంతరం విద్యార్థులచే కాకర వత్తులు కాల్చుతూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిందం చంద్రశేఖర్ మాట్లాడుతూ దీపావళి అంటే దీపాల వరుస అని పెద్దలకు మరియు పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒక ముఖ్యమైన పండుగని తెలిపారు.
ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వెంబడి రమేష్, పెట్టం తిరుపతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు