ఎండపల్లి,నేటి ధాత్రి
కోడి పుంజుల పల్లి అంగన్ వాడి కేంద్రం , లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, అనువల్ డే వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు బాల బాలికలను ఆకట్టుకున్నాయి, ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని కోడిపుంజులపల్లి లో నీ అంగన్ వాడి కేంద్రం లో ,అంగన్ వాడి ఉపాధ్యాయురాలు కొప్పుల పుష్పలత ఆధ్వర్యంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ) లో భాగంగా మహిళలు,బాల బాలికలు హాజరై పలు కార్యక్రమాలను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మహిళలు, బాల బాలికలు పాల్గొన్నారు