
"Bathukamma Celebrations at BITS School"
బిట్స్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ పాటలతో ప్రత్యేక నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థులు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని బిట్స్ పాఠశాలలోని ప్రిన్సిపల్ యుగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను తీసుకొచ్చారు.తొమ్మిది రోజులకు అనుగుణంగా 9మంది అమ్మవార్లను తయారు చేసి పిల్లలందరూ బతుకమ్మల చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ కోలలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.ఈ సందర్బంగా పాఠశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ ఇది పూల జాతర సెప్టెంబర్ నెలలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకోక తీరున రోజుకొక పేరుతో బతుకమ్మను పూలతో పేరుస్తూ ఆడపడుచులందరూ ఆనందంగా జరుపుకునే పండుగఅని అన్నారు.ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగనీ పువ్వులనే దేవుడిగా కొలవడం తమ బతుకులను,కష్టాలను పాటలుగా పాడుకోవడం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడ గుడి
కనిపించదని,బతుకమ్మ పేర్చటంలో వాడే ఆకులు,పూలు మంచి ఔషధాలు వీటిని చెరువులో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయిందని తెలియజేశారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుందనీ తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుందని హిందూ ముస్లింల ఆలైబలైలు తెలంగాణతో మమేకం మనకంటూ ప్రత్యేక విశిష్టత ఉందని మనకంటు ప్రత్యేక సంస్కృతి మన సంస్కృతిలోని పండుగలా వైభవం ఎంతో గొప్పదని అలాగే దసరా పండుగ రోజు జరిపే రావణాసురుని వధ ప్రత్యేకతను తెలియజేసి చెడుపై మంచి విజయం సాధించిన తీరును తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.