బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్టులు.

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి :
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ చలో హైదరాబాద్ పిలుపు నివ్వడంతో నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులను నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట, నెక్కొండ,చెన్నారావుపేట,ఖానపురం,మండలాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పలువురు నాయకులు ప్రకటించారు.అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బిఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని అన్నారు.పాడికౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఎపిసోడ్ అలాగే సీపీ కార్యాలయం ఎదుట హరీష్ రావు నిరసన నేపథ్యంలో ఎక్కడికక్కడ ముఖ్య నేతల అరెస్టుల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నదని ఆరోపించారు.అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బిఆర్ఎస్ కు అణిచివేయ్యలేరని ఖానపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు
హెచ్చరించారు.

నిర్బంధాలతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని అణచలేరు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిమీద అరికపూడి గాంధీ చేసిన దాడికి నిరసనగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు పిలుపు మేరకు చలో హైదరాబాద్ చేపట్టిన నేపద్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం గీసుగొండ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, కోట ప్రమోద్, ప్రసన్నకుమార్, అజయ్, బాలు లను గీసుగొండ పోలీసులు ఉదయం అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గొంతు నొక్కడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న మాకు ఇవేమీ కొత్త కాదని రాబోయే ముందు రోజుల్లో ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!