
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని టిఆర్ఎస్ బిజెపి స్టూడెంట్ యూనియన్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు
నిరుద్యోగుల చలో సెక్రటేరియట్ ముట్టడిలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ చిట్యాల మండల మాజీ యూత్ అధ్యక్షులు జన్నె యుగేందర్, బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, బీజేవైఎమ్ జిల్లా నాయకులు గొర్రె శశీ కుమార్, ఏ బి ఎస్ ఎఫ్ నాయకులు గోల్కొండ సురేష్, బీజేవైఎం యువమోర్చా మండల నాయకులు జానర్ల కుమార్ లను పోలీసులు అర్థ రాత్రి రెండు గంటలకే అరెస్టు చేసి తమ కస్టడి లో ఉంచుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షులు జన్నె యుగేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం లోనే తెలంగాణ ఉద్యమకారులను, నిరుద్యోగులను,యువజన, విద్యార్థి నాయకులకు భయపడి అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఉద్యోగాలకై ఆమరణ దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నాయకుడు మోతిలాల్ పైన మరియు నిరుద్యోగులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇంతటి దుర్మార్గమైన చర్య ఎక్కడ కూడా లేదని ఆరు నెలల కాలంలోనే ఉద్యమ నాయకులకు,విద్యార్థులకు భయపడితే రాబోయే ఐదేళ్లు ఎలా పాలిస్తారని డీఎస్సీ ఉద్యోగాలు పెంచాలని నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై శాంతియుతంగా అడుగుతుంటే అక్రమ అరెస్టులు చేయడం విలేకరుల పైన దాడులు చేయడం ఇదేనా ప్రజా పాలనా అని అన్నారు.