పరకాల పట్టణంలో పలువరి నాయకుల ముందస్తు అరెస్ట్ లు

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున పరకాల పట్టణంలో అర్ధరాత్రి ఇండ్లలో ముందస్తు అరెస్టులు చేసి పరకాల పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఉద్యమలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేపిస్తుందని ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు నోరు విప్పలేదని,రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని అలాగే రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అద్దె భవనంలో ఉంటున్నారని అన్నారు.ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ఉద్యమాలను కొనసాగిస్తాం అని మడికొండ ప్రశాంత్ తెలిపారు.

మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టు

సీఎం రేవంత్ వరంగల్ పర్యటన చేస్తునందున మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల బిల్లులను విడుదల చేయాలంటూ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున 5 గంటలకు పరకాల పోలీసులు ముందస్తు అరెస్టు చేసారని తెలిపారు.అరెస్టు అయినవారిలో పరకాల మండలం మలక్కపేట మాజీ సర్పంచ్ ధూమల శ్రీనివాస్,కామారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బుర్ర రాజయ్యలతో పలువురు మాజీ సర్పంచ్ లు ఉన్నారు.

దళితబందు సాధన సమితి అధ్యక్షులు కార్తీక్ అరెస్ట్

దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మీకు కార్తీక్ ను పరకాల పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని గత ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా రెండో విడతలో ఎంపిక కాబడి యూనిట్లని ఎంపిక చేసుకుని నిధుల మంజూరును కలెక్టర్ అకౌంట్లో జమచేసి ఇంతవరకు లబ్ధిదారులకుఅందజేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వాన్ని అనుక్షణం ప్రశ్నిస్తున్న నన్ను అక్రమంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్యగా భావిస్తున్నానని మా నిధులను మాకు తక్షణమే విడుదల చేయాలని ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నామని మీ పర్యటనలో భాగంగా మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదని దళితబందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!