చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం టిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్కు నిరసనగా ధర్నాలు చేస్తారని పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ . అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని, ఇంట్లో ఉన్న వాళ్లని అరెస్ట్ చేయడం ఏంటని బిఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల నాయకులు ఎద్దేవ చేశారు, అరెస్ట్ అయిన వారిలో టిఆర్ఎస్ నాయకులు వీరస్వామి, చిలుముల రమణాచారి ,ఏడుకొండ రాజేందర్, జన్నె యుగేందర్, దామెర రాజు ,ఆరెపల్లి సమ్మయ్య, కట్కూరి రాజేందర్, మొలుగూరి రాకేష్, తదితరులు ఉన్నారు..