
Cricket Tournament
పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ వారియర్స్ టీం
విజేతలకు బహుమతులు అందజేసిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి:
ఎల్తూరి సమృత వర్ధన్ చిన్ను ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆదివారం రోజు ఫైనల్ కు చేరుకుంది.ఫైనల్ లో పరకాల ఈగల్ వారియర్స్ టీం విన్నర్ గా పైడిపల్లి టీం రన్నర్ ఆఫ్ గా నిలిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరై ఫైనల్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,వినాయక హాస్పిటల్ యజమాని సతీష్,ఎన్ఎస్ఆర్ పవన్ కుమార్,మంద టునిట్,టాటా ఏఐజి పరకాల టీం మామిడి చక్రపాని,దారా సతీష్,పిట్టా సునీల్,అఖిల్,సిద్దు,ఏకు బాబు తదితరులు పాల్గొన్నారు.