
Chandurthi Sanitation Workers Honored with New Clothes on Dasara
దసరా సందర్భంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి నూతన వస్త్రాల బహూకరణ.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో దసరా సందర్భంగా గ్రామానికి చెందిన తొగరి గంగాధర్ (ఎస్ వి సూపర్ మార్కెట్) పారిశుద్ధ్య కార్మికులందరికీ నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఐదు సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించడం, అలాగే గ్రామంలో కూరగాయల మార్కెట్ తేవడంలో ముఖ్య భూమిక పోషించడం, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గ్రంథాలయాన్ని మరియు సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం, ఇలాంటి గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి తొగరి గంగాధర్ ని గ్రామపంచాయతీ కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే ఊరంతా శుభ్రం చేస్తున్న పారిశుద్ధ కార్మికుల యొక్క బాగోగులు గుర్తు చేసుకుంటూ వారికి నూతన వస్త్రాలు అందించడాన్ని గ్రామస్తులు అభినందించారు, గ్రామంలో ప్రతి పౌరుడు తమ గ్రామానికి ఏదో రకంగా వీలైనంతవరకు సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకున్నాడు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధ కార్మికులు తొగరి గంగాధర్ కొడగంటి గంగాధర్ పాటి సుధాకర్, బండపెళ్లి దేవయ్య, కుమ్మరి నాగరాజు, చింతం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు