దసరా పండుగ అడ్వాన్స్ ఈనెల 16న

కార్మిక శ్రమఫలం 32% రాష్ట్ర ప్రభుత్వ రివార్డ్ నగదు ఈ నెల 16 న కార్మిక అకౌంట్ లో జమ

దసరాపండుగ కంటె వారం రోజులు ముందుగానే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం టౌన్.రాష్ట్ర ప్రభుత్వ కార్మిక రివార్డ్ అందించడానికి కృషి చేసిన. టీబీజీకేఎస్. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.కాపుకృష్ణ టీబిజికేఎస్.లెవెన్ మెన్ కమిటీ సభ్యులు తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో బతకమ్మ,దసరా పండుగ ను తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రాంత ప్రజలు కుటుంబ సభ్యులతో అందరూ కలసి పెద్ద ఎత్తున జరుపుకుంటారు .
తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం సింగరేణి సంస్థ.

కార్మికులు సమిష్టి కృషి ద్వారా 2022_2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన అద్భుతమైన లాభాలు2222.46 కోట్లు సాధించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు కార్మిక వర్గానికి 711.18 కోట్లు లాభాలు 32 శాతం వాటాగా ప్రకటించి కార్మిక పక్షపాతిగా నిలిచారు.దసరా పండుగ ఈ నెల 23 న జరుగుతుండడం తో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి అందించే కార్మిక రివార్డ్ ను దసరా పండుగ కంటే వారం రోజుల ముందుగానే 16న అందించే విధంగా టి బి జి కె యస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రత్యేక చొరవ చూపారు.. టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు , ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి. మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య. కవిత ఇచ్చిన సూచన మేరకు సింగరేణి యాజమాన్యం తో సంప్రదింపులు జరిపి ఈ నెల 16 న కార్మిక రివార్డ్ కార్మికుల బ్యాంక్ అకౌంట్ లలో జమచేసే విధంగా ఒప్పందం చేయడం జరిగిందని ఒక ప్రకటన లో తెలిపారు. కాపుకృష్ణ టిబిజికెఎస్ లెవెన్ మెన్ కమిటీ సభ్యులు.
భూగర్భం లో విధులు నిర్వర్తించే కార్మికులకు ప్రతి మస్టర్ కు 662.74, రూపాయలు ,ఓపెన్ కాస్ట్, సి హెచ్. పి,లలో విధులు నిర్వర్తించే కార్మికులకు ప్రతి మస్టర్ కు 524.66 రూపాయలు కాగా డిపార్ట్ మెంట్ లలో పని చేసే వారికి మస్టర్ కి 484.31 రూపాయలు అందనున్నాయని అయన తెలిపారు. అటెండెన్స్ మీద 85% 604.50 కోట్లు,గ్రూప్ ప్రోపమేన్స్14% 99.57కోట్లు మరియు వ్యక్తి గత ప్రోపమేన్స్ 01% 7.11కోట్లు అదనంగా లభించును.2022-2023 ఆర్థిక సంవత్సరంలో 100 మస్టర్స్ పూర్తి చేసిన వారు 31 03.2023 తేది నాటికి సంస్థ నందు సంవత్సరం సర్వీస్ నిండి ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వ కె . సి ఆర్ కార్మిక రివార్డ్ కు అర్హులు అని తెలిపారు. దసరా పండుగ ను పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకోవాలనే పండుగ కంటే వారం రోజుల ముందుగానే కార్మిక రివార్డ్ అందించడానికి కృషి చేసిన టి బి జి కె యస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు , ప్రధాన కార్యదర్శి మిర్యాల. రాజిరెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల.మల్లయ్య గారికి మరియు సింగరేణియాజమాన్యంకు నా తరుపున టిబిజికెఎస్ తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు కాపుకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!