అక్టోబర్ 18న దసరా అడ్వాన్స్ చెల్లింపు

 

మందమర్రి, నేటిధాత్రి:-

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ కార్మికులందరికీ అక్టోబర్ 18న రికవబుల్ దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో చేరి 190/240మస్టర్లు పూర్తి చేసిన కార్మికులు 25వేల రూపాయలు దసరా అడ్వాన్స్ చెల్లిస్తుండగా, నూతనంగా సంస్థలో చేరిన కార్మికులకు 12,500 రూపాయలను అక్టోబర్ 18న కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ అడ్వాన్స్ ను నవంబర్ నెల వేతనం నుండి 10నెలలు సులభ వాయిదాలలో తిరిగి మినహాయింపు చేసుకోవడం జరుగుతుందని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!