*జగన్ హయాంలోనే దళితులపై విపరీతమైన దాడులు, దౌర్జన్యాలు…
*వైకాపా పాలనలో హతమైన దళితులను స్మరించుకున్న టీడీపీ నేతలు..
*దళితుల ఓట్లతో గద్దెనెక్కి వారినే బలిగొన్న ప్రభుత్వం వైకాపా అని విమర్శలు…
*పెట్రోల్, డీజిల్ ధరలపై వైకాపా వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు..
పలమనేరు(నేటిధాత్రి:
జగన్ పాలనలో దళితులపై దాడులు దౌర్జన్యాలు విపరీతంగా జరిగాయని ఇందుకు స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరించిందని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో వైకాపా పాలనలో దారుణంగా హతమైన దళితుల సంస్మరణ పేరిట మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, పట్టణ నాయకులు గిరిబాబు, గంగవరం మండల ఎస్సీ సెల్ నాయకులు రవి తదితరులు మాట్లాడారు.వైకాపా పాలనలో దళితులను ఎంతగా ఊచ కోత కోశారో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చన్న ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి హయాంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలలో 200 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు.దళితులపై నమోదైన కేసులు, దాడులు టీడీపీ పాలనతో పోలిస్తే వైసీపీ పాలనలో ఎక్కువయ్యాయని వివరించారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు. దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలలో కోతలు పెట్టారని, కొన్ని ప్రాంతాల్లో దళిత అధికారులను అవమానించడం, వేధించడం జరిగిందని ఆరోపించారు.ఇక అప్పటి ప్రభుత్వంలో దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు..
అనేక జిల్లాల్లో జరిగిన ఘటనలను ఉదాహరణలుగా చేర్చారు.
ఎన్నికల సమయంలో మాత్రమే దళితులపై ప్రేమ చూపించి, తరువాత నిర్లక్ష్యం చేస్తున్నారని వారు విమర్శించారు. ఏదేమైనా దళితుల ఓట్లతో గద్దెనెక్కి వారినే బలుగొన్న ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. అదేవిధంగా పెట్రోల్, డిజిల్ ధరల పెంపుపై వైకాపా నేతలు చేసిన ధర్నాపై వారు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి వైకాపా పబ్బం గడుపుక్కోవాలని చూడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్దకెళ్లి ధర్నా చేయాలని ఎందుకు తాము ప్రతిపక్షం నడుస్తామంటూ వ్యంగంగా సమాధానమిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడు, టీడిపి నాయకులు
సుధాకర్, శ్రీనివాసులు,సుబ్బు , లోకేష్ ఆచారి, సురేంద్ర,చందు, మురళి తదితరులు పాల్గొన్నారు.
