"Durga Mata in Katyayani Avatar Blessed Devotees at Moguillapalli"
శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత……… విశ్వంలో ధర్మాన్ని కాపాడే, భగవంతుని శక్తి స్వరూపిణి దుర్గామాత
-బోల్లేని వెంకటేశ్వర్ రావు
-దుర్గామాత సేవలో పరితపిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు
-4వ రోజు కాత్యాయని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
-కనులారా వీక్షించిన భక్తులు
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

విశ్వంలో ధర్మాన్ని, నైతిక క్రమాన్ని కాపాడే శక్తిగా, భగవంతుని శక్తి స్వరూపిణిగా దుర్గమాతని భావిస్తామని ప్రముఖ వ్యాపారవేత్త బోల్లేని వెంకటేశ్వర్ రావు అన్నారు. బతుకమ్మ-దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాంబశివ సామూహిక దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం తన కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి దయతో..చల్లని దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి..పంటలు బాగా పండి..ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, సుఖశాంతులతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆ దుర్గామాత అమ్మవారిని వేడుకున్నట్లు బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బోల్లేని సుజాత-రాజ్ కుమార్, బోల్లేని లక్ష్మీ-శ్రీనివాస్ రావు, బోల్లేని లక్ష్మీ-రవి కుమార్ దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు ధన్యులయ్యారు. కాగా 4వ రోజు శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయ అర్చకులు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించగా..దుర్గామాత అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
