
Navaratri Celebrations at Dharmaraoapet Shivalayam
శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రోత్సవాలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట శివాలయం వేదికగా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో అశ్విజ మాసం శుక్లపక్షం బహుళ పాడ్యమి సోమవారం రోజునా దుర్గమతాను ప్రతిష్టించి పూజ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది అని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. నవ దుర్గ వైభవంలొ భాగంగా మొదటి రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిందని పూజ కార్యక్రమంలొ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా అర్చకులు లంక కిషన్ శర్మ వచ్చిన భక్తులకు సంకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఇచ్చి అమ్మవారి తరుపున ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలొ సేవ సమితి సభ్యులు ఆకుల రవీందర్ వాలా నర్సింగరావు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు పూజారి కుమారస్వామి పనికెల శివకృష్ణ రత్నం మొగిలి పాలకుర్తి సాంబయ్య ఎల్లంకి రమేష్ గందే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.