చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర: 12 నుంచి 16 వరకు వైభవంగా ఉత్సవాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ దుర్గాభవాని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రుద్ర గాయత్రి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

12న సోమవారం పీర్ల గంధం, 13న మంగళవారం బేతాళ స్వామి పూజలు, 14న బుధవారం గ్రామ దేవతలకు పూజలు, ప్రవచనాలు, భజన కార్యక్రమాలు, 15న గురువారం బండ్లు, బోనాలు, 16న శుక్రవారం దుర్గామాత కళ్యాణం, పెద్ద పూజలు, గౌరంగాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
