# 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ప్రభుత్వం.
# రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి.
# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
# 6 వ రోజుకు చేరుకున్న పెద్ది ఎన్నికల ప్రచారం..
# అడుగడుగునా మాజీ ఎమ్మెల్యే పెద్ది ఘన స్వాగతం.
నర్సంపేట,నేటిధాత్రి :
కేసీఆర్ ప్రభుత్వ గత పదేండ్ల హాయంలో నిగుకుండల్లా ఉన్న చెరువులు కుంటలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలన వలన చెరువులు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.మహబూబాబాద్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవిత గెలుపు కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం సోమవారం నాటికి 6 వ రోజుకు చేరుకోగా దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, తిమ్మంపేట,ముద్దునూరు,మహ్మదాపురం లతో పాటు పలు గ్రామాల్లో సాగింది ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మంగాహరతులతో ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో మల్లంపల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం పనులు చేస్తున్న కూలీలను పెద్ది సుదర్శన్ రెడ్డి పలకరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల నేడు గ్రామాలలో ఉన్న చెరువులన్నీ నీళ్లు లేక ఎండిపోవడం అలాగే రైతులకు రొండో పంటకు అవకాశం లేక రైతులు ఉపాధి హామీ కూలీలుగా మారారని అవేదన వ్యక్తంచేశారు.ఉపాధి హామీ చట్టాన్ని తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలుపుతూ
వ్యవసాయానికి ఉపాధి హామీ పనిని అనుసంధానం చేయాలని మాజీ సిఎం కేసిఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్లో కూడా కొట్లాడడం జరిగిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశరని,డిసెంబర్ 9 న 2 లక్షల రుణమాఫీ,అన్ని పథకాలు పెంపు అని 100 రోజులు దాటినా అమలు చేయలేదని నేడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్ధపు మాటలతో రైతులను బురడి కొట్టిస్తున్నారని ఆరోపించారు. ఉపాధిహామీ కూలీలకు సంవత్సరానికి 12 వేలు అందిస్తామని చెప్పడంతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 15 వేలు కౌలు రైతులకు ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందన్నారు.నర్సంపేట నియోజకవర్గంలో
సాగునీరందక పంటలు ఎండిపోయిన రైతులను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఆదుకోలేదని పేర్కొన్నారు.నోటికచ్చిన 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 420 దొంగ ప్రభుత్వంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు,ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తెలిపారు.
బీఅర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత గెలిపించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య,వైస్ ఎంపిపి జైపాల్ రెడ్డి,సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి, ఎంపిటిసిలు తాజా మాజీ సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,అర్ఎస్ఎస్ కన్వీనర్లు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.