
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం మైలారం గ్రామంలో ఎండలు అత్యధికంగా ఉండడంవల్ల అడవుల్లో చిన్న నిప్పు రవ్వ పడిన అంటుకొని కాలుతున్నాయి. పశువుల కాపరులు అడవులలో వివిధ అవసరాలకు వెళ్లే వాళ్లు నిప్పును వేయకుండా వారు తాగిన బీడీలు, సిగరెట్ వేయడం వల్ల మైలారం గాంధీనగర్ గ్రామాల మధ్యన ఉన్న అడవి అంటుకొని కాలుతుండగా దాన్ని చూసిన ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మహారాజ్ రోడ్డు పక్కన వేసిన నిప్పు వల్ల అడవి కాలిపోతుండగా ఆ మంటలను ఆర్పారు. అడవుల్లో ఉండే వన్యప్రాణులను జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. ముఖ్యంగా ఫారెస్ట్ వారిది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లు వారి వారి పరిధిలో ఉండే అడవులను కాలిపోకుండా వన్యప్రాణులు నీళ్లు లేక చనిపోకుండా గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల ద్వారా దండోరా వేయించి దప్పు చప్పుడు ద్వారా హెచ్చరికలు చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అడవులను వన్యప్రాణులను జూన్ వరకు కాపాడాలని ధర్మసమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం