
నిజాంపేట: నేటి ధాత్రి ,మార్చ్ 30
మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం దళిత మాజీ ఉపసర్పంచ్ రోడ్డు విషయంలో జరిగిన గొడవ విషయంపై శనివారం తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఘటనస్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అనంతరం బాధితుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం కులం పేరుతో దూషించి వ్యక్తిపై దాడి చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా ఇట్టి విషయంపై విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.