Metpalli Students Achieve Black Belt
కరాటేలో జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్ సాధించినా విద్యార్ధులను అభినందించిన డి.ఎస్.పి.
మెట్ పల్లినేటి దాత్రి
జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణా రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ మాస్టర్ అధ్వర్యంలో ప్రధాన కార్యాలయము హైదరాబాద్ లో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పరీక్షలో మెట్ పల్లి కేంద్రానికి చెందిన నలుగురు విద్యార్థులు వి.శ్రీకృప, ఎస్.హర్షిని, ఏం. నిఖిల్, బి. శశాంక్ లు ఉత్తీర్ణత పొంది, బ్లాక్ బెల్ట్ లు సాధించిన సందర్భంగా జె.కె.ఎ ఇండియా షోటోఖాన్ కరాటే అసోసియేషన్ మెట్పల్లి కరాటే శిక్షకులు వంశీ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మెట్ పల్లి డి.ఎస్.పి కార్యాలయంలో డి.ఎస్.పి రాములు జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ సమక్షంలో విద్యార్ధులకు సాధించినా ప్రశంసా పత్రాలు, పథకాలు అందజేసి, అభినందించి సత్కరించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణను ఇచ్చి బ్లాక్ బెల్ట్ సాధనకు కృషి చేసిన మెట్పల్లి బ్రాంచ్ కరాటే మాస్టర్ వంశీ నాయుడును డి.ఎస్.పి ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్, కరాటే శిక్షకులు వంశీ నాయుడు, విశ్వ తేజా,సురేందర్, శ్రీనివాస్ జయప్రకాష్ ఆనంద్ కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
