DSP Candidate Bochchu Nagaraju Campaigns in Ward 19
19వ వార్డులో డిఎస్పీ అభ్యర్థి ప్రచారం
పరకాల,నేటిధాత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బొచ్చు నాగరాజు 19వవార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించాడు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పరకాలలో ఎన్నికలు అంటే పార్టీలకి పార్టీల కి మధ్య పోటీ కాదని పేదలకి ధనవంతుల కి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు.వార్డులో సరైన రోడ్లు లేవు,డ్రైనేజీ,బస్తీ దవాఖాన లేదని ప్రభుత్వ పతాకాలు ప్రజలకి అందజేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఈరోజు మల్లి డబ్బులతోనే రాజకీయాలకు వస్తున్నారని ఇలాంటి రాజకీయ పార్టీలకు నాయకులకి బుద్ధి చెప్పడానికి టార్చ్ లైట్ గుర్తు పై ఓటువేసి నన్ను అత్యధిక మెజార్టీ తో గెలిపించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మైదం రవి,రాష్ట్ర నాయకులు రత్నాకర్,మండల అధ్యక్షులు కోడపాక ప్రతాప్,సురేష్, సుమన్,తదితరులు పాల్గొన్నారు.
