DSFI Protest at Ekalavya School
కొత్తగూడ ఏకలవ్య గురుకుల పాఠశాల ఎదుట డి ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ధర్నా…….!!
కొత్తగూడ, నేటిధాత్రి:
https://youtu.be/LxKWVb_bkvU?si=ZXDva35PXFQXgffa
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకూడా కారంతో భోజనం పెట్టడం పట్ల ఆగ్రహించిన డి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బానోత్ దేవేందర్…సమస్యలు తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో గేట్ ఎదుట ధర్నా….ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకులాల పట్ల నిర్లక్యం వహిస్తున్న ఆర్ సి ఓ పై చర్యలు తీసుకోవాలి — సంబంధిత వార్డెన్ ప్రిన్సిపాల్ లను సస్పెండ్ చేయాలి….
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గత నాలుగు రోజుల నుండి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో కూడిన భోజనం తిని కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్న విద్యార్థుల గోడని తెలుసుకుందామని ఏకలవ్య గురుకుల పాఠశాలకి వెళ్తే అనుమతించకోవడంతో గెట్ ఎదుట DSFI అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు……ఈ సందర్భంగా DSFI రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచిన అప్పటినుండి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న ఎల్లిపాయ కారం తో భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని, ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటంవల్ల పిల్లలు బయటకు రాలేక, ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు…..మొన్న జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడంతో డిఎస్ఎఫ్ఐ నేతలు అగ్రహించారు…చివరికి నిన్న పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని గుడ్డుతో కూడిన భోజనం పెట్టడంతో ఆ భోజనంలోనే పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్లు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి, ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని తెలిపారు….ఇది ఇలా ఉండగా ఏకలవ్య స్కూలు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులు పూర్తిగా హిందీలోనే బోధిస్తున్నారని, ఈ భాష ఈ ప్రాంత విద్యార్థులకు అర్థం కాకపోవడం తో విద్యార్థులు చదువులు అప్పటికంటే ఇప్పుడే చాలా వెనుకబడి ఉన్నారని, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, డిఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు…ఉదయం 8 గంటలకు వచ్చిన ఉపాధ్యాయులు మధ్యాహ్న ఒంటిగంట వరకే ఉండి ప్రభుత్వం వాల్లకు కల్పించిన క్వార్టర్స్ లోకి వెళ్లిపోయి మళ్లీ పిల్లల ముఖం చూడటం లేదు ధ్వజమెత్తారు..అసలు పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నారని కూడా పట్టించుకోవడంలేదని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఏకలవ్య స్కూలుకు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి RCO పై,పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో DSFI మండల నేతలు శేఖర్,నవీన్, సురేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు
