నిద్రమత్తులో వైద్యాధికారి….?

బ్రేకింగ్ న్యూస్ నేటిధాత్రి

 

పి.హెచ్.సి లోనే కునుకుతీస్తున్న డాక్టర్లు? ఇబ్బందులు పడుతున్న రోగులు?

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ చేయాల్సిన డాక్టర్ నిద్రపోతున్న పరిస్థితి.

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్లు, డ్యూటీ సమయంలో నిద్రపోతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మండల కేంద్రములోని డాక్టర్
నిద్రలో ఉండటం ఆరోగ్య కేంద్రంకు వచ్చే ప్రజలకు నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని ప్రజల ఆవేదన. అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యుడు (మెడికల్ ఆఫీసర్) ఆసుపత్రి ఛాంబర్ లోనే నిద్రపోవడం, అది గమనించిన స్థానికులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిద్రపోతున్న మెడికల్ ఆఫీసర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు స్థానిక ప్రజలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *