మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మాదక ద్రవ్యాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి అన్నారు.గురువారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి ఓసిపిలో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆర్కేపి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేపథ్యంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు యాంటి నార్కోటిక్ అవేర్నెస్ డే కార్యక్రమంలో భాగంగా రామకృష్ణాపూర్ ఉపరితల గని లో మహాలక్ష్మి కంపనీ ఆధ్వర్యంలో పని చేసే సుమారు 70 మంది కార్మికులకు మాదక ద్రవ్యాల వాడకం పై అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.చెడు వ్యసనాలకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించినట్లు తెలిపారు. పట్టణంలో ,కాలనీలలో ఎవరైనా గంజాయి,అమ్మినా,సేవించినా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని,గంజాయి మహమ్మారి నిర్మూలకై అందరూ కృషిచేయాలని కోరడం జరిగిందని అన్నారు.