నస్పూర్ ఎస్సై సుగుణాకర్
నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆక్స్ ఫర్డ్ స్కూల్ విద్యార్థుల ద్వారా డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. రామగుండం సిపి ఆదేశాల మేరకు నస్పూర్ సిఐ అశోక్ కుమార్, ఎస్సై నేల్క సుగుణాకర్ ఆధ్వర్యంలో షిర్క్ సెంటర్ నుంచి ర్యాలీగా విద్యార్థులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహం వరకు వందలాది మంది ర్యాలీగా పాల్గొన్నారు. ఎస్సై సుగుణాకర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు అనేవి మనిషికి తక్షణం ఆనందాన్నిచ్చిన దీర్ఘకాలంలో అవి భయంకరమైన ప్రభావాలను దారి చూపుతాయి. మాదకద్రవ్యాలు వినియోగం వలన విద్యార్థుల యొక్క జ్ఞాపకశక్తి నశించిపోతుందని, శారీరక రుగత్మకలు కలిగి చిన్న వయసులో అనేక రకాలైన వ్యాధులకు గురి అవుతారని, విద్యార్థిని, విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండాలని మీ చుట్టూ ప్రక్కల వారు ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడితే వారిని రిహాబిటేషన్ సెంటర్కు తరలించే కార్యక్రమంలో సహాయ సహకారాలను అందించాలని తెలిపారు.50 వేల వరకు ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలలో విద్యార్థులు డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి ప్రమాదకర దురలవాట్లకు వీరిలో కొంతమంది బానిసలుగా మారుతున్నారు. పశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో వీరిపై మాధక ద్రవ్యాల ప్రభావం పడుతుంది. యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలయ్యే అలవాటు చివరికి బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు, స్నేహితులు, బాంధవ్యాలను మరచి ఒంటరిగా కుంగిపోయి చివరికి ఆత్మహత్యలు కూడా దారి తీయొచ్చని తెలియజేశారు. గంజాయి, మాదకద్రవ్యాలను తీసుకుంటే మానసిక మరియు నాడీవ్యవస్థ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. గంజాయిలో కెన్వవినాయిడ్స్ అనే మత్తు పదార్థం ఉంటుంది. అతిగా సేవిస్తే స్క్రోజోఫోనియాకు గురవుతారు. మత్తుకు బానిసలుగా మారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. కుటుంబ సభ్యుల దురలవాట్లు వారసత్వంగా సక్రమించే ఆస్కారం ఉంది. స్వేచ్ఛతో పరిస్థితుల ప్రభావంతో చెడుపోకడలకు బానిస అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎనిమిదో తరగతి నుంచి విద్యార్థులకు లైఫ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్స్, జనరల్ బిహేవియర్ వంటి వాటిపై కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ ఎస్సై నేల్కా సుగుణాకర్, ఆక్స్ ఫర్డ్ కరస్పాండెంట్ ఆంటోనీ, ప్రిన్సిపాల్ జస్టిన్, వైస్ ప్రిన్సిపాల్ థామస్, మరియు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.