
driving rules
కొత్త వాళ్ల తో బస్సు డ్రైవింగ్
తృటిలో తప్పిన ప్రమాదం
ఆ జాగ్రత్తగా బస్సును నడిపిన మాస్టర్ మైండ్ స్కూల్ డ్రైవర్
ఇవన్నీ కామన్ అంటున్న స్కూల్ యాజమాన్యం
అడ్డుకున్న బీజేపీ నేతలు
గతంలో నిబంధనలు పాటించట్లేదని ఫిర్యాదు చేసిన పట్టించుకోని విద్యాధికారి
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నిబంధన అతిక్రమనలు తారా స్థాయికి చేరుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం స్కూల్ బస్ నడపడానికి ఎలాంటి అనుభవం లేని కొత్తగా లైసెన్స్ తీసుకున్న డ్రైవర్లచే బస్సును నడిపిస్తూ పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పాఠశాల బస్సు నడపాలంటే ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారిని పెట్టాలనే నిబంధనలను అతిక్రమిస్తూ ఇష్టాను రీతిలో యాజమాన్యం ప్రవర్తిస్తున్నారు. గురువారం రోజున ఉదయం పిల్లలను ఎక్కించుకొని పాఠశాల వైపు అతివేగంగా వస్తున్న బస్సును గమనించిన బిజెపి మండల నాయకులు ఆపి ప్రశ్నించగా డ్రైవర్ కు లర్నింగ్ లైసెన్స్ ఉందని అది కూడా కొద్ది రోజుల క్రింద అప్లై చేసి ఉందని దానిని చూసి యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఇవన్నీ కామన్ అంటూ సర్దుకునే ప్రయత్నం చేశారు. కామన్ అంటూ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని బిజెపి నాయకులు వాగ్వాదానికి దిగగా డ్రైవర్ ను తీసేస్తున్నాం అని చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు. గతంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ఎంఈఓ పలుమార్లు విన్నవించుకున్న కనీసం పట్టించుకోవట్లేదు అని తెలిపారు. ఒక పాఠశాలను మొదలుపెట్టే ముందు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తున్నటువంటి పత్రాలను మండల విద్యాధికారి ఆఫీసులో జత చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో ప్రైవేటు పాఠశాలల పత్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలకు అనుమతులు ఇస్తున్నారా? లేదంటే కనీసం అనుమతుల వివరాలను చూడకుండా ఇస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాలపై అధికారులు చొరవ తీసుకొని ప్రైవేటు పాఠశాలల మీద విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలను సీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శులు నంది నరేష్, దాసరి గణేష్, సాయి కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.