One-Way Traffic Due to Road Repairs
వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి
దామెర ఎస్సై కొంక అశోక్ సూచన
పరకాల,నేటిధాత్రి
పరకాల నియోజకవర్గం దామెర మండల పరిధిలోని ఊరుగొండ నుండి ఎన్ఎస్ఆర్ హోటల్ వరకు జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతు పనులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఈ పనులు వారం రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోడ్డు పనుల దృష్ట్యా ఈ మార్గంలో వన్-వే విధానం అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ క్రమంలో వాహనదారులు ఓవర్టేకింగ్ చేయకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.దామెర ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ,రోడ్డు పనుల సమయంలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రత్యేకంగా ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండి,సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
