సీతంపేటలో తీరిన తాగునీటి కష్టాలు

*3 లక్షల 85 వేల తో బోర్ వేయించి నీటి కష్టాలు తీర్చిన
ఎంపీపీ జక్కుల ముత్తయ్య
కృతజ్ఞతలు తెలిపిన సీతంపేట గ్రామస్తులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామంలో తాగునీటి కష్టాలు తీరాయి. గ్రామంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి దాదాపు రూ, 3 లక్షల 85 వేల నిధులతో బోరు వేసి సోమవారం మోటార్ బిగించారు. దీంతో గ్రామంలోని పెరకవాడలో గత కొన్ని సంవత్సరాలుగా తాగునీరు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారని, వారి బాధలు గుర్తించి మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి బోరు వేసి మోటర్ బిగించి సోమవారం తాగునీటి కష్టాలు తీర్చమని ఎంపీపీ తెలిపారు. ఈ వేసవికాలంలో బోర్ వేసి తాగునీరు అందించిన ఎంపీపీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!