వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆనందదాయకం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం
ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల నాయకులకు ఆర్యవైశ్యలు హర్షం వ్యక్తం చేశారు, సందర్భంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ప్రధాన కార్యదర్శి అనంతుల సంతోష్ కోశాధికారి ఆరగొండ సమ్మయ్య మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయినా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ముత్తారం వాసవి ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ముత్తారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పేద వైశ్యులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీనివాస్ ఎల్లంకి సత్యనారాయణ మల్యాల హనుమయ్య మల్యాల వెంకటరాజo ఎల్లంకి సుమన్, కట్కూరి రవీందర్ నగునూరి మల్లికార్జున్ ఎల్లంకి రాజు ఎల్లంకి వెంకటరమణ కుక్కడపు సత్యనారాయణ కోటగిరి మారుతి అంజి ప్రసాద్ కజ్జం రమణయ్య పాల్గొన్నారు