
`రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య మార్పులు.
`పది రోజులు కాంగ్రెస్ పై చేయి.
`పది రోజులు బిఆర్ఎస్ కాయ్ రాజా కాయ్.
`రెండు పార్టీల మధ్య నువ్వా! నేనా అన్నట్లు రాజకీయం.
`ఏ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందో!
`ఏ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందో అర్థం కానీ పరిస్థితి.
`కేసులు తెరమీదకు రాగానే బీఆర్ఎస్ సైలెంట్.
`విపత్తులు రాగానే బీఆర్ఎస్ లో జోష్.
`రెండు పార్టీలకు బీసీ నినాదం తలనొప్పి.
`కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ను వెంటాడుతోంది.
`స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ను తరుముతున్నాయి.
`ఆరు గ్యారంటీల అమలు ఇప్పట్లో కష్టమే.
`ఇంకా ఆలస్యమైతే మొదటికే మోసమే!
`బీజేపీది మౌన వ్రతమే!
`గ్రూప్ వన్ మీద నోరు విప్పింది లేదు.
`ఎరువుల మీద ప్రశ్నించింది లేదు.
`కాంగ్రెస్ చేస్తున్న ఎదురుదాడికి సైతం సమాధానం చెప్పే పరిస్థితి లేదు.
`కాంగ్రెస్ ను దోషిగా చూపించే ధైర్యం లేదు.
`బీఆర్ఎస్ మీద నోరు పారేసుకోవడం తప్ప మరేం చేయడం లేదు.
`ఎరువుల బురద రుద్దుకునేందుకు సిద్ధంగా లేదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాల్లో పాలకపక్ష కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరౌతున్నాయి. ప్రతి క్షణం కిరికిరి ఏదో ఒక కిరికిరిలో ఇరుకుంటున్నాయి. ఇటీవల కాలంలో . రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాjయి. పది రోజులు కాంగ్రెస్ పార్టీ పై చేయి. పది రోజులు బిఆర్ఎస్ కాయ్ రాజా కాయ్. రెండు పార్టీల మధ్య రాజకీయ గొడవలు తప్ప. రాష్ట్ర ప్రయోజనాలు, పరిపాలనా విశేషాలు, చర్చలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తెల్లారిలేస్తే ఏదో ఒక రాజకీయ వివాదాలు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య ఎల్ల కాలం నువ్వా..నేనా అనే రాజకీయమే సాగుతోంది. సహజంగా రాజకీయం ఎన్నికల వరకే అంటారు. కాని నిత్యం రాజకీయాలే చేస్తుంటారు. ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టాలని పాలకపక్షం చూడడం.. ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రతిపక్షం చూస్తున్నాయి. ప్రజలేమనుకుంటున్నారన్న సంగతి మాత్రం ఎప్పుడో మర్చిపోయారు. ఈ సందర్భంగా ఏ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందో..ఏ పార్టీ గ్రాఫ్ పడిపోతుందో తెలియడం లేదు. ఆయా పార్టీలు కూడా అంచనా వేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నాయి. ప్రధాన మీడియా స్రవంతిని పాలకపక్షం గుప్పిట్లో పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ప్రజల మూడ్‌ను బట్టి, ప్రధాన మీడియా కూడా గోడదుండే రాజకీయాలకు పాల్పడుతోంది. ఇలా మీడియా కూడా రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకొని ఊరేగుతోంది. సోషల్ మీడియా చెప్పేది అబద్దమని పాలక పార్టీ అంటుంది. అదే పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడే సోషల్ మీడియా మీద ఆధాపడి రాజకీయం చేస్తుంది. ఇలా ఎప్పుడూ రాజకీయాలను సజీవంగా వుంచుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పడేస్తున్నారు. బిఆర్ఎస్ విషయానికి వస్తే ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం మీద చేసిన పోరాటం ఒక్కటంటే ఒక్కటైనా వుందా? అదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పిపిసి. అద్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజుకో సమస్యతో ప్రజల్లో వుండేవారు. ప్రజలకు అందుబాటులో వుండేవారు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ వుండేవారు. అలా మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర నుంచి మొదలు, నిరుద్యోగుల సమస్యలపై నిత్యం ఏదో రకమైన పోరాటం చేస్తూ వచ్చేవారు. బాసరలో విద్యార్ధుల సమస్యలమీద రేవంత్ చేసిన పోరాటం ఇప్పుడు ఏ బిఆర్ఎస్ నాయకుడైనా చేస్తున్నాడా? హస్టళ్లలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడుతున్నారా? వి ద్యార్దులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెస్తున్నారా? వారికి అండగా నిలిచే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తుందా? హస్టల్లలో విద్యార్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే అక్కడి వెళ్లడం, మీడియాను అడ్రస్ చేయడం తప్ప మరేం చేయలేదు. ప్రభుత్వం ఎలాగూ డిఫెన్స్‌లో వుంది. మేం పోరాటంచేయాల్సిన అసవరం లేదన్న ధీమా బిఆర్ఎస్లో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను ప్రజలు కాదనుకుంటే ప్రత్నామ్నాయం మేమే అన్న ఆలోచన మాత్రమే బిఆర్ఎస్లో వ్యక్తమౌతోంది. అంతే తప్ప సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దామనే ప్రణాళిక మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. ఎక్కడ ప్రభుత్వం తమపై కేసుల్లో ఒత్తిడి తెస్తుందో..అరెస్టుల పర్వం మొదలు పెడుతుందో అన్న భయం కూడా చాలా మంది బిఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఒకప్పటి ఉద్యమస్పూర్తి, పోరాటాలు బిఆర్ఎస్లో కనిపించడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడబలుక్కొని రాజకీయం చేస్తున్నట్లే వున్నాయి. పది రోజులు కేసుల మీద తప్ప వార్తలుండవు. రెండేళ్ల కాలంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి కేసుల చుట్టూ రాజకీయం తిప్పారు. ఆఖరుకు కాళేశ్వరం మీద కేసును సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. నిజం చెప్పాలంటే కాళేశ్వరం మీద వేసిన కమీషన్ కూడా కొండను తవ్వి ఎలుకను పట్టింది. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. దాంతో కాళేశ్వరంలో ఎలా ముందుకు సాగాలో అర్ధం కాక కేంద్రం కోర్టులోకి ప్రభుత్వం బంతిని వదిలేసింది. ఇలా కేసులతో కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కొంత వాయిదా వేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు అమలు చేసే పరిసి ్దతి కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి బిసి నినాదమనేది కాంగ్రెస్ మెడకు చేజేతులా చుట్టుకున్నారు. నిజం చెప్పాలంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని హమీలు ఇవ్వకుండా వున్నా అధికారంలోకి వచ్చేవారు. కాని ఒకదాని తర్వాత ఒకటి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హమీల వైపు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని ఆరు గ్యారెంటీలన్నారు. అందులో పదమూడు చేర్చారు. మొత్తగా నాలుగువందల ఇరవై హమీలు ఇచ్చారు. అందులో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అనే మాట కాకుండా పార్టీ పరంగా అమలు చేస్తామని చెబితే ఎంతో బాగుండేది. ఇప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించేందుకు వీలుగా వుండేది. కాని ఆ అవకాశం కాంగ్రెస్ జార విడుచుకున్నది. లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకున్నది. రాజ్యాంగ రిత్యా 42 శాతం బిసిలకు రిజర్వేషన్లు అమలు సాద్యం కాదని కాంగ్రెస్ నాయకులదంరికీ తెలుసు. కాని ప్రకటించారు. ఇచ్చిన హమీని అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుందని తెలుసు. తెలిసి తెలిసి హమీని ఇచ్చారు. బిసిలను ఇప్పుడు మోసం చేస్తే కాంగ్రెస్‌ను సహించరు. క్షమించరు. తెలంగాణలో బిసి ఉద్యమం, నినాదం బలంగా క్షేత్రస్ధాయిలోకి వెళ్లాయి. ఇప్పుడు దానిని ఆపడం ఎవరి తరం కాదు. అన్ని పార్టీలు ఇప్పుడు బిసి నినాదం వినిపించాల్సిందే. కాని ఆ నినాదమే కాంగ్రెస్‌కు గుది బండగా మారిపోయింది. దీనితో ముడిపడి వున్న స్దానికి సంస్ధ ఎన్నికలు పెట్టే పరిసి ్ధతి లేదు. ఇప్పటికిప్పుడు స్దానిక సంస్దల ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ పరిస్టితి ఏమిటో నాయకులందరికీ తెలుసు. ఆఖరుకు అది రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకోవచ్చు. ఆఖరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి కూడా ఎసరు పెట్టొచ్చు. అందుకే ఆగుతున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో వచ్చిన యూరియా కొరత అనేది రైతుల్లో ఆగ్రహజ్వాలలు రగిలిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు కనిపించినా, ఓట్లు అంటూ వచ్చినా ఎలా వుంటుందో తేలిపోయింది. మరో వైపు హైకోర్టు తీర్పు గుడువు ముంచుకొస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌పార్టీ సాలెగూడులో చిక్కుకున్నంతగా గిలగిలాడుతోందని చెప్పకతప్పదు. యూరియా సమస్యను రైతుల మరో పదేళ్ల దాకా మర్చిపోకుండా చేసుకున్నారు. నిజానికి ఎరువుల కొరత వరకు రాష్ట్రంలో బిఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత వుండేది. కాలేశ్వరం విషయంలోనూ ప్రజల్లో బిఆర్ఎస్ మీద కోపమే వుండేది. ఎప్పుడైతే ఎరువుల కొతర వచ్చిందో అప్పటి నుంచి బి ఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఈ మధ్యలో కవిత ఎపిసోడ్ వల్ల బిఆర్ఎస్కు నష్టం జరగుతుందని అనుకున్నారు. కాని ఆఖరుకు ప్రజలు కవితనే మర్చిపోయే పరిస్దితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టింది. కొంచెం ముందుగా ఎరువుల కొతరపై దృష్టిసారిస్తే బి ఆర్ఎస్, కవిత మధ్య ఆదిపత్య పోరు రసవత్తరంగా వుండేది. అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేది. ఒక్క యూరియా సమస్య మొత్తం కాంగ్రెస్ తలరాతను మార్చేసింది. ఇందులో దూరడానికి బిజేపి ప్రయత్నం చేయడం లేదు. అడకత్తెరలో పోక చెక్క కావడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఏ మాత్రం నోరు తెరిచినా ఎరువుల పరంపరలో పరువు పోగొట్టుకునే పరిస్ధితి తెచ్చుకునేది. అయినా బిజేపి స్టాటజీ ఏమిటో అంతు చిక్కడం లేదు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎరువులు కొరత వుంది. అది మా వల్ల జరిగింది కాదని చెప్పుకునే శక్తి కూడా బిజేపి నాయకులకు లేదా? గతంలో ఇచ్చింది మేమే..ఇప్పుడు ఇస్తున్నది మేమే.. మా వల్ల ఎక్కడా పొరపాటు జరగలేదు. అని చెప్పడానికి బిజేపి నాయకులకు నోరు రావడంలేదా? కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నమే జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ మూలంగా ఎరువుల దిగుమతి ఆలస్యమైందని తప్పును బిజేపి నెత్తిన ఆ పార్టీ నాయకులు వేసుకుంటున్నారు. దాంతో తెలంగాణలో ఇప్పటి వరకు వున్న పేరును కూడా చెరుపుకుంటున్నారు.