ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి, జనవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి
బేగంపేట డివిజన్ లోని మాతాజీ నగర్ లో గత వారం రోజులుగా డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లాటంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నా విషయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి తెలిపారు. బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి మాతాజీ నగర్
లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు.ఈ సందర్బంగా ఎ మ్మేల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మాతాజీనగర్లో డ్రైనేజీ పొంగిపొర్లడంతో సమస్యలు పరిశీలించి మాతాజీ నగర్ వొంపులో ఉండడం వల్ల సనత్ నగర్ పై భాగం లో ఉండడం వలన పైనుండి వస్తు న్న నీరు, డ్రైనేజీ నీళ్ళు,క్రింది భాగం లో నిలిచిపోతుందని అదేవిధంగా డ్రైనేజీ సమస్యలు ఎదుర వుతు న్నాయని అన్నారు. వాటర్ వర్క్స్ అధికారులు ఇంజనీరింగ్ అధికా రులతో మాట్లాడుతూ సగభాగం వరకు పైప్ లైన్ ఏర్పాటు చేశామని మిగిలిన భాగం నూతన పైపులను ఏర్పాటు చేసి సత్వరమే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు వాటర్ వర్క్స్అధికారులు,సురేష్యాదవ్,
రాజయ్య,స్థానికులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో….