నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని 18 వ వార్డు చెందిన కోట పురుషోత్తం తండ్రి కోట వీరస్వామి అనారోగ్యంతో మరణించగా వరంగల్ జిల్లా బిజెపి నాయకులు డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు గౌడ్, నియోజకవర్గ యువ మోర్చా ఇంచార్జ్ కొంకీస విగ్నేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజు, గూడూరు సందీప్ మహిళా మోర్చా వరంగల్ జిల్లా నాయకురాలు సూత్రపు సరిత,జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ కూనమల్ల పృథ్వీరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నూనె రంజిత్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కుసుమ భవాని శంకర్, ఖానాపూర్ మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మధుకర్, పట్టణ యువ మోర్చా కార్యదర్శి చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.