# రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దికి లేఖ.
# సహకరించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు
# బీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట బీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి లేఖ రాశారు.గతంలో నుండి బీఆర్ఎస్‌లో చేరిన రాణా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.నియోజకవర్గం వ్యాప్తంగా యూత్ ఫాలోయింగ్ ఉన్న డాక్టర్ రాణా పార్టీలో కొన్ని కారణాల వలన ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.కాగా భాజపాలో చేరిన రాణా ప్రతాప్ రెడ్డి భాజపాను రికార్డ్ స్థాయిలో తెచ్చారు.భాజపాలో చేరిన గత నర్సంపేటలో చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి రాణాకు కొన్ని కారణాలలో వ్యత్యాసం రావడంతో భాజపా పార్టీ నుండి పక్కకు పెట్టింది.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరల పార్టీలోకి తీసుకున్నారు.ఐతే యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో నియోజకవర్గ యూత్ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్యే పెద్ది బాధ్యతలు అప్పగించారు.ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన రాణా ఆయనకు అండగా ఉన్నారు.కాగా ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పై సొంత పార్టీ కౌన్సిలర్స్ అవిశ్వాసం తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు.రాష్ట్రంలోనే నర్సంపేట మున్సిపాలిటీకి గుర్తింపు ఉన్నదని ఇక్కడ ఇలాంటి రాజకీయాలు జరుగుతున్న కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టింపు లేకుండా వ్యవహరించటం పట్లనే బిఆర్ఎస్ పార్టీకి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన తనకు ఒక సంవత్సరం పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ వ్యక్తిగత కారణాల రీత్యా, మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు డివిజన్ యూత్ కన్వీనర్ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.రాజీనామా లేఖను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పంపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో సహకరించిన పార్టీ కార్యకర్తలకు,నాయకులు, యువకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.