Dr. Praveen to Receive Sakalakalaa Vallabha Award
*అవార్డు అందుకోబోతున్న డాక్టర్ ప్రవీణ్..
*అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 25 వ వార్షికోత్సవ మహోత్సవం..
తిరుపతి(నేటిధాత్రి)
అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 25 వ వార్షికోత్సవ మహోత్సవం లో
సకలకళా వల్లభ అవార్డును డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ అందుకోబోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.విజయవాడ నగరంలోని గాంధీనగర్ నందు గల శ్రీ వెలిదండ్ల హనుమంతురాయ గ్రంథాలయం నందు ఈనెల 18 వ తేదీన మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అవార్డు అందుకోబోతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని స్థానిక వాస్తవ్యులు ఎలమంచిలి ప్రవీణ్ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నా, 17 సంవత్సరాలకే తండ్రిని కోల్పోయినా సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరియర్ ప్రారంభించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ తనకు వచ్చే ఆదాయంలోనే కొంత భాగం సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తూ ప్రతి రంగంలోనూ తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నారు. ఎవరన్నా ఒక రంగంలో నిష్ణాతులై వారి ముద్రని వేసుకుంటారు కానీ ఎలమంచిలి ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారుపట్టుదలతో మరియు ఆకంటిత దీక్షతో గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాలలో దాదాపు1000 సామాజిక కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా దాదాపు 500 కార్యక్రమాలకు పైగా అతిథులుగా విచ్చేసి ఎన్నో, మరెన్నో అవార్డులు ప్రభుత్వ పురస్కారాలతో పాటు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 (అర్థ సెంచరీ)పురస్కారాలను అందుకొని
1.విద్య రంగం, 2.క్రీడారంగం, 3.సినిమా రంగం,4.కళా రంగం,5.సాంస్కృతిక రంగం,6.సాంఘిక రంగం, 7.సేవా రంగం, 8.వైద్య రంగం , 9.వ్యవసాయ రంగం,
10.ఆధ్యాత్మిక రంగం,11.వ్యాపార రంగం
వంటి తదితర రంగాలలో విశిష్ట సేవలు పురస్కరించుకొని సకల కళా వల్లభ అవార్డును అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వారు బహూకరించ నున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయమూర్తి దేవు. నరసింహారావు చేతులు మీదుగా ఈ పురస్కారాన్ని ఎలమంచిలి ప్రవీణ్ అందుకోనున్నారు.
