Chinnareddy Unveils Dr Madhava Reddy Statue in Wanaparthy
డాక్టర్ మాధవరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన
రాష్ట్ర ప్రణాలిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
వనపర్తి నేటిదాత్రి .
హైదరాబాద్ ఉస్మానియా హాస్పటల్ డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి 77 వ జయంతి సందర్భంగా వనపర్తి నియోజకవర్గ o జయన్న తిరుమలాపురం రోడ్డులో దివంగత డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి విగ్రహాన్ని డాక్టర్ మాధవరెడ్డి సోదరుడు రాష్ట్ర ప్రణాళిక సంఘంవైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆవిష్కరిం చారు డాక్టర్ మాదవరెడ్డి జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగాచిన్నారెడ్డి మాట్లాడుతూ
మా సోదరుడు డాక్టర్ మాధవ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి డాక్టర్ అయి పేద ప్రజలకు వనపర్తి ప్రజలకు సేవ చేశారని తెలిపారు . వనపర్తి పట్టణంలో ప్రతి ఆదివారం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు ని పేర్కొన్నారు వనపర్తి పట్టణంలో గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జిల్లెల మాధవ రెడ్డి గారి పేరును ఖరారు చేయడం మాధవరెడ్డి సేవలకు దక్కిన గౌరవం అని చిన్నారెడ్డి తెలిపారు. వైద్య పరంగా మాధవ రెడ్డి వనపర్తి కి చేసిన సేవలు మరువలేనివి అని దానికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈకార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కిరణ్ కుమార్, రాష్ట్ర మైనారిటీ నాయకులు కమర్ మియా అక్తర్ జిల్లామైనారిటీ అధ్యక్షులు సమద్ మియా, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏఐపిసి అధ్యక్షులు నాగార్జునవనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు రోహిత్, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు జయన్న తిరుమలాపురం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
