
పెద్దపల్లి జిల్లాలో 100 అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు, సన్న హాలు,
విగ్రహ ప్రదాత,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ ( వాసు,)
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, అంబేద్కర్ యూత్ అండ్ అసోసియేషన్, ఆధ్వర్యంలో మంగళవారం ఓదెల మండలం నాంసాని పల్లి గ్రామంలో సమావేశం జరిగింది, నాంసానిపల్లి గ్రామ అంబేద్కర్ యూత్ అండ్ అసోసియేషన్ నల్లాల రామ్ నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కురుమ పల్లి మాజీ,సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూరు విగ్రహాల ప్రధాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆసం పల్లి లక్ష్మీ పౌండేషన్ చైర్మన్ ఆసం పల్లి శ్రీనివాస్,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇరుగురాల క్రిష్టయ్య, జిల్లా కోకన్వీనర్ సంకెనపల్లి లక్ష్మయ్య, పాల్గొన్నారు, ఆసంపల్లి వాసు ను, శాలువతో ఘనంగా సన్మానించారు పూల బొకే అందించి అభినందించారు, ఈ సందర్భంగా నూరు అంబేద్కర్ విగ్రహాల,పదాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి దిక్సూచి ప్రపంచ మేధావి, భారతరత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు అణ గారిన,వర్గాలకు స్ఫూర్తిని స్తుందన్నారు
దళిత అనగారిన,వర్గాల తో పాటు అన్ని వర్గాలకు అన్ని హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఆయన విగ్రహాలను పెద్దపల్లి జిల్లాలోని గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తామన్నారు,నూరు అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్టాపనే ధ్యేయంగా పనిచేస్తానన్నారు, అంకితభావంతో పనిచేస్తున్న ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం సేవలను అభినందించారు, క్రమశిక్షణ కలిగిన,అంబేద్కర్ సంఘం నాయకుల తో కలిసి పని చేయడం సంతోషకరమన్నారు,, అంబేద్కర్ విగ్రహాలు అవసరం ఉన్నవారు, తనను గాని, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్యను కానీ సంప్రదించాలని కోరారు.