తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా సాగిన డాక్టర్ బరిగెల రమేష్

వరంగల్ పార్లమెంట్ బరిలో నిఖార్సయిన ఉద్యమ నాయకుడు
డాక్టర్ బరిగెల రమేష్

వెల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబం నుండి హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఎదిగిన నేత
వరంగల్ పార్లమెంట్ బరిలో తెలంగాణ ఉద్యమ నాయకుడు
రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులను ఉద్యమం లో భాగస్వామ్యం చేసిన ఉద్యమ నేత
వరంగల్ ముద్దు బిడ్డ ఉద్యమ పోరు కెరటం రమేష్
తెలంగాణ ఉద్యమంలో కేసులు, సస్పెండ్ లను పట్టించుకోకుండా ఉద్యమాన్ని నడిపించుటకు మెడికల్ జాక్ ఏర్పాటే కాకుండా మెడికల్ జాక్ చైర్మన్ గా ఉద్యమంలో పాల్గొన్నారు
సేవా భావం కలిగిన నాయకుడు,
నీతి నిజాయితీగా ఉద్యమమే ఊపిరిగా సాగిన డాక్టర్ బరిగెల రమేష్
ఉద్యమనాయకుడు డాక్టర్ బరిగెల రమేష్ కి పార్లమెంట్ అభ్యర్థి గా అవకాశం కల్పించుటకు కాంగ్రేస్ పెద్దలు సానుకూలంగా ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం
తెలంగాణ మెడికల్ జాక్ చైర్మన్,
ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్
ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
డాక్టర్ బరిగెల రమేష్ జనరల్ సర్జన్
గ్రామ,పేద స్థాయి నుండి డాక్టర్ గా, ఉద్యమ నాయకుడిగా ఎదిగిన నేత
ప్రత్యేక తెలంగాణ వైద్యుల సంఘం ఏర్పాటుకు, దాని ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఎనలేని కృషి
ప్రజల్లో మృదుస్వభావిగా నిజాయితీ డాక్టర్ గా గుర్తింపు

పరకాల నేటిధాత్రి
డాక్టర్ బరిగెల రమేష్ హన్మకొండ జిల్లా పరకాల మండలంలో వెల్లంపల్లి గ్రామంలోని బరిగెల ఉప్పలయ్య లచ్చమ్మ దంపతుల నలుగురి సంతానం లో రెండవ వారు
7 వ తరగతి వరకు స్థానిక వెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో,8,9,10 వ తరగతులు, నడికూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ కాలేజీలో చదివారు.1988 నుండి 89 వరకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ లో బీ ఫార్మసీ చదివి, 1989 నుండి 1994 వరకు ఎంబిబియస్ కాకతీయ మెడికల్ కాలేజ్ హన్మకొండ లో పూర్తి చేసారు.
ఆ తర్వాత 1998 నుండి 2002 వరకు స్టేషన్ ఘనపూర్, జఫర్గాడ్ మండలాల్లో మెడికల్ ఆఫీసర్ గా పని చేసారు
ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఉస్మానియా ఆసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ గా పని చేస్తూనే తెలంగాణ పోరాటం లో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉద్యామ నాయకుడిగా ఎదిగారు డాక్టర్ బరిగెల రమేష్.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో కోదండరాం సార్ స్థాయి పోరాటం, ముక్యంగా ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, వైద్య సంఘాలు, మెడికల్ జాక్ చైర్మన్ గా ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించిన వ్యక్తిగా పేరు
అనేక మంది ఉద్యమకారులతో ప్రత్యేక్ష సంబంధాలు ఉన్న వ్యక్తి, కాంగ్రేస్ పార్టీ అధిష్టానం కూడా ఉద్యమకారులకి సముచిత స్థానం ఇస్తాం అంటూ చెప్పడం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మండలి లో ఉద్యమకారుడిగా పేరు ఉండడంతో షర్ట్ లిస్ట్ లో కూడా బరిగెల రమేష్ పేరు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం
రాష్ట్రంలోని వైద్య పరమైన సమస్యల పరిష్కారానికి రమేష్ కేంద్ర బిందువు అయ్యారు
అనేక ఉద్యమాలు చేసారు
సామాజిక ఉద్యమాల్లో సైతం చురుకైనా పాత్ర పోషించే డాక్టర్ బరిగెల రమేష్ ఉస్మానియా ఆసుపత్రి జనరల్ సర్జన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు
డాక్టర్ బరిగెల రమేష్ వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం హన్మకొండ జిల్లాకి (వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానికుడు) చెందిన వారు
రమేష్ కి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి
ఉద్యమ నాయకులు కోదండరాం, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులను కలిసి మద్దతు కూడా కట్టుకుంటున్నారు
విద్యార్టీ, ప్రజా సంఘాల నాయకులతో కూడా రమేష్ కి విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి
ఇప్పటికే మంత్రి మండలిని కలిసిన రమేష్ తనకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా అవకాశం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు
ముక్యంగా మంత్రి కొండా సురేఖ ,సితక్క రేవంత్ రెడ్డి లకు సూపరిచితుడైన రమేష్ తనకే టికెట్ వస్తుందనే ధీమాగా ఉన్నారు
ఇప్పటికే కొండా సురేఖ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వర్ధన్నపేట నాగరాజు, భూపాలపల్లి శాససభ్యులు గండ్ర సత్యనారాయణ, పాలకుర్తి శాసనసభ్యులను పలుమార్లు కలిసిన్నట్టు వారు రమేష్ పట్ల సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!