
పరకాల నేటిధాత్రి
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో మెడికల్ జాక్ చైర్మన్ బరిగెల రమేష్
బుధవారం రోజున మంత్రులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు మెడికల్ జాక్ చైర్మన్ కలిసి తనకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన వారికి తప్పకుండా కాంగ్రేస్ పార్టీ అవకాశం కల్పిస్తుందని అన్నారని తనకు అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని డాక్టర్ బరిగెల రమేష్ అన్నారు.