
హసన్ పర్తి/ నేటి ధాత్రి
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పేరు
వరంగల్ పోరు బిడ్డ
తెలంగాణ ఉద్యమంలో కోదండరాం స్థాయి పోరాటం
రాష్ట్ర,జిల్లాలో విస్తృతంగా పరిచయాలు
డాక్టర్ గా, సామజిక ఉద్యమకారుడిగా గుర్తింపు
అధిష్టానం రమేష్ వైపు మొగ్గు?
షార్ట్ లిస్టులోను పేరు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో కోదండరాం సార్ స్థాయి పోరాటం, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, వైద్య సంఘాలు, మెడికల్ జాక్ చైర్మన్ గా ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించిన వ్యక్తిగా పేరు అనేక మంది ఉద్యమకారులతో ప్రత్యేక్ష సంబంధాలు ఉన్న వ్యక్తి, కాంగ్రేస్ పార్టీ అధిష్టానం కూడా ఉద్యమకారులకి సముచిత స్థానం ఇస్తాం అంటూ చెప్పడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మండలి లో ఉద్యమకారుడిగా పేరు ఉండడంతో షర్ట్ లిస్ట్ లో కూడా బరిగెల రమేష్ పేరు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం
రాష్ట్రంలోని వైద్య పరమైన సమస్యల పరిష్కారానికి రమేష్ కేంద్ర బిందువు అయ్యారు
అనేక ఉద్యమాలు చేసారు
సామాజిక ఉద్యమాల్లో సైతం చురుకైనా పాత్ర పోషించే డాక్టర్ బరిగెల రమేష్ ఉస్మానియా ఆసుపత్రి జనరల్ సర్జన్ ఉస్మానియా మెడికల్ కాలేజి అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు
డాక్టర్ బరిగెల రమేష్ వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం హన్మకొండ జిల్లా చెందిన వారు
రమేష్ కి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి
ఇప్పటికే మంత్రి మండలిని కలిసిన రమేష్ తనకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా అవకాశం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు
ముఖ్యంగా కొండా సురేఖ ,సితక్క, రేవంత్ రెడ్డి లకు సూపరిచితుడైన రమేష్ తనకే టికెట్ వస్తుందనే ధీమాగా ఉన్నారు
ఇప్పటికే కొండా సురేఖ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వర్ధన్నపేట నాగరాజు, భూపాలపల్లి శాససభ్యులు గండ్ర సత్యనారాయణ, పాలకుర్తి శాసనసభ్యులను పలుమార్లు కలిసిన్నట్టు వారు రమేష్ పట్ల సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.