
– బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని తోట ఆగయ్య పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచయాని కొనియాడారు.
జగ్జీవన్ రామ్ ఒక గొప్ప సంఘసంస్కర్త, రాజకీయవేత్త సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడు అని అన్నారు.. వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు..
రానున్న రోజుల్లో వారి ఆలోచన స్ఫూర్తిగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను నిత్యం స్మరించుకునే విధంగా సిరిసిల్ల శాసన సభ్యులు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో సిరిసిల్ల నియోజకవర్గంలోని జిల్లెళ్ళ గ్రామములో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రారంభించిన వ్యవసాయ కళాశాలను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ పెరుతో నెలకొల్పడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు న్యాలకొండ అరుణ,పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, కుంబాల మల్లారెడ్డి,
గజభింకార్ రాజన్న,మాజీ ఎంపీపీ చెంద్రయ్య, సత్తార్,
సత్యనాయణ,కిషన్ తదితరులు పాల్గొన్నారు.