ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి.
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 6 ఏరియాలోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం యువజన విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
బి.సదానందం ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.నర్సింగ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్
బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసిన ఘన నివాళులు అర్పించారు.అనంతరం జె. నర్సింగ్ మాట్లాడుతూ..
దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట యోధుడు అణగారిన వర్గాల సంక్షేమం కోసం సంఘ సంస్కర్తగా అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి సంకల్పించిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్ వారు మన దేశానికి తొలి దళిత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆదర్శ పాలక అధ్యక్షులుగా పేరు గడించారని తెలియజేశారు.అలాగే అతి పిన్న వయసులో మంత్రి బాధ్యతలు చేపట్టి భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా 40 ఏళ్ల పాటు భారత దేశ పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులను చేపట్టిన గ్రామీణ కార్మికుల కోసం అణగారిన వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ పని చేసే వారని అలాంటి మహనీయుడైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క 118 వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మంచిర్యాల నియోజకవర్గ కమిటీ మరియు యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అభినందనీయమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో
సంక్షేమ సంఘం నస్పూర్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శులు సిహెచ్ వాసు,టి.విజయ్ యూత్ నాయకులు,సుజిత్,ప్రజ్వాల్, జశ్వంత్,అరవింద్,బబ్లూ, నరేష్,తేజ,యశ్వంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.