పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి విగ్రహ కమిటీ అధ్యక్షులు బొచ్చు ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులుగా పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ,కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రావు దేశానికి దళిత సమాజానికి ఎన్నో సేవలు అందించడం జరిగిందని ఆయన యొక్క సేవలను గుర్తు చేశారు.మన హక్కుల కోసం బిచ్చం ఎత్తుకోవద్దని పోరాటం చేసి సాధించుకోవాలని నినాదించిన మహనీయుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గూడెల్లి సదన్ కుమార్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, రాయపర్తి ఎంపీటీసీ మల్లారెడ్డి,రమేష్,మార్క రఘుపతి గౌడ్,బండి సదానందం గౌడ్,నల్లెల అనిల్, అల్లం రఘునారాయణ,ఏకు రవికుమార్,కొత్తపెళ్లి రవి, చెరుపల్లి మొగిలి,బుర్ర రాజమౌళి గౌడ్,మడికొండ లలిత,లక్కం వసంత,బొచ్చు జెమిని,బొచ్చు రవి, మురళీధర్,లక్కం శంకర్, మల్లేశం,ఎండి గౌస్,మరుపట్ల ఐలయ్య,అజయ్,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.