జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు,భారత తొలి ఉప ముఖ్యమంత్రి , సమానత్వ సమాజ స్థాపనకై పోరాడిన కృషివలుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ తన సిబ్బందితో కలిసి డాక్టర్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి తిలకం దిద్ది పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిస్వార్ధమైన పోరాటానికి ,స్వచ్ఛమైన మనస్తత్వానికి, నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ జగ్జీవన్ రామ్ అనే మహానుభావుడని సమాజానికి అతడు చేసిన సేవ ఏనాటికి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.