"BJP Pays Tribute to Dr Ambedkar"
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ మాట్లాడుతూ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత జ్ఞాన శిఖరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ప్రసాదించిన త్యాగమూర్తి ఆయనను స్మరించుకోవడంతో పాటు తన ఆశాయ సాధనలో భారత దేశ సమాజమంతా ప్రయాణించగలిగినప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బట్టు రవి భూపాలపల్లిబిజెపి అర్బన్ అధ్యక్షులు గీసా సంపత్ కుమార్,రూరల్ అధ్యక్షులు పులిగుజ్జ రాజు, జిల్లా నాయకులు తాటికంటి రవి కుమార్, మాచనవేన రవీందర్, చెక్క శంకర్, పొన్నాల కొమురయ్య రాజేష్ పాపయ్య వేణు సుమన్ తదితరులు పాల్గొన్నారు
