ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు:-
వరంగల్/హనుమకొండ, నేటిధాత్రి(న్యాయ విభాగం):-
14-04-2025 నాడు ఉమ్మడి బార్ అసోసిషన్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి. ర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి. అర్ అంబేద్కర్ భవనంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు.
వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు అయిన వలస సుదీర్, పులి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇరువురు అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు మనకు అందించిన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగంలో కెల్లా అతి పెద్ద రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్ పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడారని, ఆయన గొప్ప మానవతా వాది అని తెలిపారు. న్యాయవాదులు మరియు యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ బార్ అసోియేషన్ వైస్ ప్రెసిడెంట్ జైపాల్, ప్రధాన కార్యదర్శి D.రమాకాంత్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, ఇరు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జయాకర్, జనార్ధన్ మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు. మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.