ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి
మహోన్నతుడి ఆశయాలను కొనసాగించాలి సోమరపు శ్రీరాములు
కేసముద్రం/ నేటి ధాత్రి
మహోన్నతుడు మహనీయుడు భారతదేశపు రాజ్యాంగ పితామహుడు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 135 వ జయంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహినుద్దీన్ ఆదేశాల మేరకు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎన్ హెచ్ ఆర్ సి అండ్ డబ్ల్యు ఈ ఓ కేసముద్రం మండల ప్రెసిడెంట్ సోమారపు శ్రీరాములు, జన్ను శీను పూలమాలతో సత్కరించిన అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈ గొప్ప మహనీయుడి జయంతి జరుపుకోవాలని చాలా సంతోషకరం వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ తెలియజేశారు.