సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
నర్సంపేట,నేటిధాత్రి:
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని ఆయన స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని దేశాన్ని కాపాడుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక ఓంకార్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళిలర్పించారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని మతం భాషా ప్రాంతం పేరుతో విచ్ఛిన్నం చేసి అధికారాన్ని కాపాడుకునేందుకు దోపిడి పాలకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలో అన్ని వర్గాలకు సమన్యాయం కోసం ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు బిజెపి మతోన్మాద పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో కలలుకని దేశాన్ని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజ్యాంగాన్ని రచిస్తే అందు విరుద్ధంగా పాలకులు వివరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అలాంటి వారే మళ్లీ అంబేద్కర్ పేరు జపం చేయడం సిగ్గుచేటు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి రాష్ట్ర నాయకులు మందరవి జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ రాష్ట్ర జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్ చంద్రయ్య రాజిరెడ్డి కొమురయ్య సావిత్రి నాగేష్ ఉదయ రవి మల్లికార్జున్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.