
Dr. Anil Kumar passes away due to illness..
సిరిసిల్ల పట్టణ ప్రజా వైద్యశాల డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ (ప్రజా వైద్యశాల) ఈరోజు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన సుదీర్గ కాలంగా సిరిసిల్ల ప్రజానీకానికి (ప్రజా వైద్యశాల నెలకొలిపి) వైద్య సేవలు అందించారు.