రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజావాణిలో వచ్చిన పిర్యాదు మేరకు విచారణ జరిపిన జిల్లా పంచాయతీ అధికారి రవీందర్. ఈసందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత వారి వాంగ్మూలాలను స్వీకరించి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన డిమాండ్ రిజిస్టర్ యొక్క జిరాక్స్ లు పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా, తన దృవీకరణ లేకుండా ఏవిధంగా ఇతరులకు చేరాయి అనే విషయంపై వాదనలు విన్న డిపివో రవీందర్ సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎంపివో, గ్రామ ప్రత్యేక అధికారి బండ రాజశేఖర్ రెడ్డి, గ్రామ పంచాయితీ కార్యదర్శి మహమ్మద్ పాషా, క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.